సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- December 19, 2025
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నప్పటికీ, ఈ ఘటనకు హైదరాబాద్ లేదా తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ అంశంపై అనవసర అపోహలు సృష్టించవద్దని ఆయన సూచించారు.
డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ ప్రాంతానికి చెందిన సాజిద్ అక్రమ్ 1998లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే స్థిరపడిన అతడు యూరోపియన్(European) వంశానికి చెందిన వెనెరా గ్రాసో అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత జీవితాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలోనే కొనసాగించాడు.
సాజిద్ అక్రమ్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు రికార్డులు ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. 1998లో భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన సాజిద్, అనంతరం 2004, 2009, 2011, 2016లో భారత్‌ను సందర్శించాడు.2016లో ఆస్తి సంబంధిత వ్యవహారాల కోసం వచ్చాడని, 2022లో చివరిసారిగా తన తల్లి, సోదరిని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు.
బోండీ బీచ్‌లో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందగా, ఘటనపై ఆస్ట్రేలియా అధికారులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పేరు అనవసరంగా ప్రస్తావించబడుతోందని, దీనికి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పోలీసు శాఖ మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







