ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు

- December 19, 2025 , by Maagulf
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు

హైదరాబాద్: విఖ్యాత గాయకుడు పద్మభూషణ్ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వంశీ సంస్థలకు ఆత్మీయుడని, వంశీ ఇంటర్నేషనల్ సాంస్కృతిక సంస్థ అధినేత వంశీ రామరాజు అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై వంశీ ఇంటర్నేషనల్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, ఎస్.పీ. నిర్మల సాంస్కృతిక సంగీత సేవా సంస్థ నిర్వహణలో “బాలు పాటకు పట్టాభిషేకం” పేరిట సినీ పాటల నీరాజన కార్యక్రమం ఘనంగా జరిగింది.

నటుడు పద్మనాభం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మర్యాద రామన్న ద్వారా సినీ పరిశ్రమలో గాయకుడిగా అడుగుపెట్టిన ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గానప్రస్థానానికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.పీ. నిర్మల, గాయకులు రవి బాబు, లింగ రాజు, హరి, బాంబు రాజని, అనురాధ తదితరులతో కలిసి బాలు పాడిన సోలోలు, యుగళ గీతాలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వంశీ రామరాజు మాట్లాడుతూ, “ఘంటసాల, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం తెలుగు వారి అమూల్య సంపద. బాలు గానానికి హద్దులు లేవు. ఆయన పాటలు తరతరాలకు మార్గదర్శకాలు” అని అన్నారు. అలాగే గాయని నిర్మల గళం శ్రావ్యంగా ఉందని ప్రశంసించారు.

ఎన్నో వంశీ సంస్థల కార్యక్రమాల్లో బాలు పాల్గొన్న సందర్భాలను వంశీ రామరాజు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.సంగీతప్రియులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గాన వైభవాన్ని మరోసారి స్మరింపజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com