న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి
- December 19, 2025
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది.ఈ నేపధ్యంలో తాజాగా విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి రుజువు చేశారు.
వింటేజ్ లుక్‌తో పాటు గ్రేస్, ఎనర్జీ కలగలిపిన ఈ స్టిల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉత్తేజపరుస్తూ ఓ ప్రత్యేక పోటీని కూడా ప్రారంభించారు. విడుదల చేసిన కొత్త స్టిల్స్‌తో క్రియేటివ్ డిజైన్లు రూపొందించాలని,వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రత్యేక ‘MSG’ మర్చండైజ్ బహుమతిగా అందిస్తామని తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార, కేథరిన్ త్రెసా నటిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







