యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!

- December 21, 2025 , by Maagulf
యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!

యూఏఈ: యూఏఈలో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వర్షాలతో రోడ్డు చెరువులను తలపించాయి. సెల్లార్లు, లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తాయి. దీంతో వాహనదారులు చిన్నపాటి కారు సమస్యలతో గ్యారేజీలు కిక్కిరిసిపోయాయి. షార్జాలోని అల్ నహ్దాకు చెందిన నివాసి మసూద్ అలీ, రాత్రిపూట పార్క్ చేసిన ప్రదేశంలో నీరు నిలిచి ఉండటాన్ని చూశాడు. "ఉదయం కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది అస్సలు స్టార్ట్ అవ్వలేదు," అని అతను చెప్పాడు.  

ఇటీవలి వర్షాల తర్వాత చిన్నపాటి వాహన సమస్యలతో సతమతమవుతున్న షార్జా మరియు దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాల నివాసితులలో అలీ కూడా ఒకరు. ఏప్రిల్ 2024 నాటి చారిత్రాత్మక వర్షాల మాదిరిగా పెద్ద ఎత్తున వరద నష్టం లేనప్పటికీ, ఈ వర్షాలు కార్లను మాత్రం పాడు చేశాయని, మరమ్మతుల కోసం పరుగులు తీసేలా చేస్తున్నాయని పలువురు తెలిపారు.

మరో నివాసి అహ్మద్ నజ్జార్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. "కారు స్టార్ట్ అయింది, కానీ సరిగ్గా నడవడం లేదు," అని అతను చెప్పాడు.  షార్జా మరియు దుబాయ్‌లోని కొన్ని గ్యారేజీలు ప్రస్తుతం పూర్తిగా బుక్ అయి ఉన్నాయని, దీనివల్ల వాహనదారులు తమ కార్లను సర్వీసింగ్ చేయించుకోవడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.

కేవలం వర్ష సంబంధిత మరమ్మతులే కాకుండా ఇతర సమస్యలతో కూడా కార్లు తమ వద్దకు షార్జాలోని నజ్మ్ గ్యారేజ్‌కు చెందిన మెకానిక్ అయ్యుబ్ చెప్పాడు. అయితే, ఇప్పటికే గ్యారేజ్ లో చాలా వాహనాలు వరుసలో ఉన్నాయని కొత్త వాహనాలను తీసుకోవడం లేదని పేర్కొన్నారు.కాగా, ఏప్రిల్ 2024 వరదల మాదిరిగా కాకుండా, ప్రస్తుత కేసులలో చాలా వరకు చిన్నపాటి సమస్యలే ఉన్నాయని మెకానిక్‌లు చెప్పారు.  ముఖ్యంగా ఎయిర్ ఫిల్టర్‌లోకి నీరు వెళ్లడం, స్పార్క్ ప్లగ్‌ లు పాడవ్వడం,  తాత్కాలిక స్టార్టింగ్ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com