ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- December 21, 2025
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) తన ప్లాటినం జూబ్లీ ఇయర్ కల్చరల్ ఫెస్టివల్ టిక్కెట్ల అమ్మకాలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జయాని మోటార్స్ జనరల్ మేనేజర్ రిజ్వాన్ తారిఖ్, స్కూల్ చైర్మన్ అడ్వకేట్ బిను మన్నిల్ వరుగేసే, స్టార్ విజన్ చైర్మన్ సేతురాజ్ కడక్కల్ తదితరులు పాల్గొని ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ కన్వీనర్ ఆర్. రమేష్‌కు తొలి టిక్కెట్లను అందజేశారు.
జనవరి 15 మరియు 16 తేదీలలో సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఈ గ్రాండ్ ఫెస్టివల్ జరగనుంది. మొదటి రోజు ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు స్టీఫెన్ దేవస్సీ మరియు అతని బృందంచే హై-ఎనర్జీ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. రెండవ రోజు ISB విద్యార్థుల కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తారు. అనంతరం నేపథ్య గాయకులు రూపాలి జగ్గా మరియు అభిషేక్ సోని నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ రాఫిల్ డ్రా. జయానీ మోటార్స్ అందించిన MG కారు మొదటి బహుమతిగా ఉంటుంది. మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జనవరి 18న డ్రా జరగనుంది. టిక్కెట్ల ధర రెండు దినార్లు. వచ్చిన మొత్తాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల ఆర్థిక సహాయం మరియు ఉద్యోగుల సంక్షేమానికి కేటాయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







