రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!

- December 21, 2025 , by Maagulf
రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!

రియాద్: సౌదీ అరేబియా రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే కావడంపై సమీక్షి నిర్వహించారు. శుక్రవారం దాదాపు 200 విమానాలు ఆలస్యంగా లేదా రద్దు చేసిన విషయంపై ఆయన ఆరా తీశారు. ఆయనతో పాటు GACA అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్, రియాద్ విమానాశ్రయాల కంపెనీ CEO అయ్మాన్ అబు అబా మరియు సీనియర్ విమానాశ్రయ అధికారులు ఉన్నారు. విమానాశ్రయ సౌకర్యాలను సందర్శించి,  ప్రయాణీకుల రాకపోకలను పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచాలని మరియు అత్యున్నత భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల హక్కుల రక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com