నాలుగు నిఘా విమానాలు బోయింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన భారత్
- July 27, 2016
చైనాను దృష్టిలో ఉంచుకుని భారత్ సుమారు బిలియన్ డాలర్ల విలువ చేసే నాలుగు నిఘా విమానాలు కొనుగోలు చేయడానికి బోయింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ నేవీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, హిందూమహా సముద్రంలో చైనా ఉనికిని పర్యవేక్షించడానికి నిఘా విమానాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల గురించి తెలుసుకోవడానికి ఎనిమిది పీ-81 విమానాలను వినియోగిస్తున్నారు. ఈరోజు మరో నాలుగు కొత్త విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారు. ఒప్పందంపై నేడు సంతకం చేసినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడలేదు. చైనా నేవీ హిందూ మహాసముద్రంలోకి ఎక్కువ ప్రాంతాలకు తమ జలాంతర్గాములను పంపిస్తున్న నేపథ్యంలో భారత్ నిఘా పటిష్ఠం చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







