అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్
- December 24, 2025
విజయవాడ: అదనపు సొలిసిటర్ జనరల్‌గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం తాజాగా నియమించింది.కనకమేడలతో పాటు దవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తరుఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాలతో పాటుగా న్యాయరంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కీలక పాత్ర పోషించనున్నారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







