బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- December 24, 2025
మనామా: వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులను బహ్రెయిన్ లకే పరిమితం చేయాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనకు పార్లమెంటు అంగీకరించింది. రహదారి భద్రత మరియు పని చేసే హక్కుతో సంబంధం ఉన్నందున పౌరులు మాత్రమే ఆ పాత్రను పోషించాలని ఎంపీలు కోరారు. ఈ ప్రతిపాదనను ఎంపీలు బాదర్ అల్ తమీమి, హసన్ ఇబ్రహీం, మొహమ్మద్ మౌసా, డాక్టర్ అలీ అల్ నుయిమి మరియు హమద్ అల్ డోయ్ పార్లమెంట్ లో ప్రతిపాదించారు.
కీలక రంగాలలో బహ్రెయిన్ లనే నియామించాలని, క్రమంగా విదేశీ కార్మికులను తొలగించాలని కోరారు. వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం జీవితాలు మరియు ఆస్తి భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశమని వారు అన్నారు. ప్రైవేటీకరణ తరువాత విదేశీయులను ఆ పోస్టుల్లో నియమించారని, ఇది బహ్రెయిన్‌లకు ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపీలు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ పోస్టును బహ్రెయిన్ పౌరులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు క్రమంగా తమ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







