2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

- December 24, 2025 , by Maagulf
2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ తయారు చేసిన 2026 సంవత్సర క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సి.ఎం.క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్, డైరీలను అధికారికంగా విడుదల చేసి అధికారుల, ఉద్యోగుల మధ్య పంపిణీకి సూచించారు.

అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన ఈ క్యాలెండర్, డైరీలు 2026లో అసెంబ్లీ కార్యకలాపాలను, కీలక తేదీలను సులభంగా గుర్తించడానికి, అధికారులు, ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెక్రటేరియట్ కార్యాలయం చేసే కార్యనిర్వాహణకు కొత్త ఉత్సాహాన్ని అందించే విధంగా ఈ క్యాలెండర్, డైరీలు రూపొందించబడ్డాయని, అందరి కోసం సౌకర్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com