రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- December 24, 2025
రియాద్: రియాద్ మెట్రోలో వార్షిక టిక్కెట్లు మరియు విద్యార్థుల కోసం టర్మ్ టిక్కెట్ల ధరలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇవి జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. వార్షిక టిక్కెట్లు డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాల్లోనూ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటాయని అథారిటీ స్పష్టం చేసింది. వీటిలో స్టాండర్డ్ క్లాస్ టిక్కెట్ ధర SR1,260 మరియు ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర SR3,150గా ప్రకటించారు.
పాఠశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెమిస్టర్ టిక్కెట్లను కూడా ప్రకటించింది. ఇవి డిజిటల్ మరియు ప్లాస్టిక్ రెండు రూపాల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ టిక్కెట్లు కేవలం స్టాండర్డ్ క్లాస్లో మాత్రమే SR260 ధరకు అందుబాటులో ఉంటాయి. యాక్టివేషన్ తేదీ నుండి నాలుగు నెలల పాటు చెల్లుబాటు అవుతాయి. ఇది పూర్తి సెమిస్టర్ను కవర్ చేస్తుందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







