బంగాళాఖాతంలో కొన్ని శకలాలు లభ్యం
- July 27, 2016
బంగాళాఖాతంలో కొన్ని శకలాలు కనిపించాయని కాగా అవి అదృశ్యమైన ఏఎన్-32 విమానానికి చెందినవి అవునో.. కాదో తేల్చాల్సి వుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 29 మంది రక్షణ సిబ్బందితో తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తున్న ఏఎన్-32 విమానం జులై 22న కనిపించకుండా పోయింది. టేకాఫ్ అయిన 16 నిమిషాలకే రాడార్ నుంచి అదృశ్యమైంది. 'దేని గురించీ కచ్చితమైన నివేదికలు లేవు. కానీ కొన్ని శకలాలు గుర్తించాం. అవి ఏఎన్-32 విమానానికి చెందినవా.. కావా నిర్ధారించాల్సిందిగా అధికారుల్ని కోరాం' అని పారికర్ తెలిపారు.
అదృశ్యమైన విమానం జాడ కనుక్కునేందుకు భారత నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 17 నౌకలు, 23 విమానాలు అన్వేషణ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో సాయపడేందుకు మారిషస్‌లోని సాగర్ నిధి సంస్థను కోరినట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







