తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- December 24, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ పథకాల్లో అనర్హులను తొలగించేందుకు సిద్ధమైంది.ముఖ్యంగా పేదలకు అందించే పథకాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధిదారులుగా ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.దీంతో వారిని గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే.. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్న కొంతమంది ఉద్యోగులు నిరుపే దలకు అందాల్సిన పింఛన్లు, ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా పొందుతున్నట్టు అధికారిక లెక్కల్లో తేలింది.దీనికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నివేదిక ప్రకారం..దాదాపు 37 వేల మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాల్లో లబ్ది పొందుతున్నట్టు బయటపడింది.వీరిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.ఈ జాబితాలో చిరుద్యోగులే కాదు..ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, వీరి పేర్లు లబ్దిదారుల జాబితాలోకి ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చనీయాం శంగా మారింది.
ప్రభుత్వం పేదలకోసం అందిస్తున్న పథకాల్లో ఏఏ పథకంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.. వారిలో ఎంతమంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఎంత మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారనే వివరాలను ఉన్నతాధికారులు ఇప్పటికే సేకరించారు. ఆ డేటా ఆధారంగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి స్పష్టమైన సిఫార్సులు చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కల్ కింద జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ ఉద్యోగులకు, టైమ్ స్కేల్ ఉద్యోగులకు.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తక్షణమే నిలిపివేయాలని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. వీరు నిబంధనల ప్రకారం అనర్హులని తేల్చిచెప్పారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సర్వీసులు, డైలీ వేజ్, హానరోరియం (గౌరవ వేతనం) తీసుకునే సిబ్బంది విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారులు తమ నివేదికలో సూచించారు. అయితే, ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా ఉన్నతాధికారులు సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 37 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







