అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- December 24, 2025
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ (TEC) అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించింది.ఇది సముద్ర తీర ప్రాంతాలను మెరుగుపరచడం , కువైట్ పర్యాటక మరియు వినోద రంగాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని TEC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్వర్ అల్-హ్లైలా తెలిపారు.
ఆయన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కు మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రాంతీయ పర్యాటక మరియు విశ్రాంతి గమ్యస్థానంగా కువైట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యంలో తీరప్రాంతాలను అభివృద్ధి చేయాలనే TEC వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్లు తెలిపారు.
దాదాపు 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఇందులో పిల్లల కోసం ఇండోర్ ఎంటర్ టైన్ మెంట్ హాల్, ఒపెన్ మరియు వాటర్ ప్లే ఏరియాలు, సముద్ర దృశ్యాలతో కూడిన హెల్త్ క్లబ్, రెస్టారెంట్లు మరియు కేఫ్‌లు, డ్రైవ్-త్రూ సర్వీస్ యూనిట్లు ఉంటాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







