త్వరలో విడుదల కానున్న 'అమీర్‌పేటలో'
- July 27, 2016
శ్రీ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అమీర్‌పేటలో'. అశ్విని కథానాయిక. మహేష్ నిర్మిస్తున్నారు. మురళి స్వరకర్త. బుధవారం హైదరాబాద్‌లో పాటల విజయోత్సవం జరిగింది. శ్రీ మాట్లాడుతూ ''సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే అమీర్‌పేటలోని పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ రాసుకొన్నా. సహజంగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశా. మురళి స్వరాలు చిత్రానికి మరింత బలం చేకూర్చాయ''న్నారు. ''చిన్న చిత్రాల గురించి పరిశ్రమ, ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొనేలా చేస్తుందీ చిత్రం. శ్రీ చిత్రాన్ని బాగా తెరకెక్కించాడు. మురళి అందించిన పాటలు విజయవంతమయ్యాయ''న్నారు నిర్మాత. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, రతిక, రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







