కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- December 25, 2025
అమెరికా: అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రఖ్యాత నగరమైన ల్యాస్ ఏంజెలిస్లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ భాగస్వామ్యంతో VFS గ్లోబల్ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. డిసెంబర్ 15 నుంచే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. భారత రాయబార కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ప్రవాస భారతీయులకు అన్ని రకాల సేవలను వేగంగా అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ICAC కేంద్రం ద్వారా భారత ప్రవాసులకు అవసరమైన అన్ని ముఖ్యమైన సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇందులో కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులు, వీసా అప్లికేషన్లు, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు, భారత పౌరసత్వ పరిత్యాగ ధృవీకరణ పత్రాలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్, అటెస్టేషన్ వంటి సేవలు లభిస్తాయి. దీనివల్ల పనుల కోసం వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. సమయం కూడా బాగా ఆదా అవుతుంది. ల్యాస్ ఏంజెలిస్ సెంటర్ ప్రారంభంతో అమెరికాలో VFS గ్లోబల్ నిర్వహిస్తున్న భారతీయ కాన్సులర్ కేంద్రాల సంఖ్య 17కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టులోనే బోస్టన్, డల్లాస్, డెట్రాయిట్, శాన్ జోస్ వంటి ప్రధాన నగరాల్లో 8 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. పాస్‌పోర్ట్, వీసా, లైఫ్ సర్టిఫికెట్, బర్త్-మెరిజ్ సర్టిఫికెట్ల వంటి సేవలన్నీ ఇప్పుడు కేవలం ఈ VFS కేంద్రాల ద్వారానే క్రమబద్ధంగా అందించబడుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న సుమారు 53 లక్షల మంది ప్రవాస భారతీయులకు మేలు చేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. VFS గ్లోబల్ ప్రతినిధి అమిత్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ల్యాస్ ఏంజెలిస్‌లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ కేంద్రం వారికి ఎంతో ఉపయోగపడనుంది. సాధారణ రుసుములోనే రిటర్న్ కొరియర్ సౌకర్యాన్ని చేర్చడమే కాకుండా.. ఫోటోలు, ఫోటోకాపీలు, ఫారమ్ ఫిల్లింగ్ వంటి సేవలను కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందిస్తున్నారు. వీకెండ్ సర్వీసులు మరియు పని వేళలు పెంచడం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







