మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...

- December 25, 2025 , by Maagulf
మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...

మస్కట్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజా శాంతి, నైతిక విలువలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఆసియా దేశాలకు చెందిన పలువురు వ్యక్తులను General Directorate of Traffic అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాల్లో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా ఈ ఘటనపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు, విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులను గుర్తించి పట్టుకున్నారు. వీడియోలో వారు రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజా క్రమశిక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపించిందని అధికారులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, నిబంధనల ఉల్లంఘనలను సహించబోమని అధికారులు హెచ్చరించారు. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధికారులు మరోసారి గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com