మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- December 25, 2025
కువైట్: మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 జాతీయ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్ కి ఎన్.ఆర్.ఐ టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో ఘనమైన అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఎన్.ఆర్.ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి అధ్యక్షతన జరిగింది.
ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వీకరించిన సందర్భంగా, నాజర్ సేవలను స్మరిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ కోడూరి మాట్లాడుతూ, సయ్యద్ నాజర్ ఒక ఉత్తమ కవిగా సమాజ ఐక్యత, సామాజిక చైతన్యం కోసం తన కవిత్వం ద్వారా గొప్ప సందేశాలను అందిస్తున్నారని ప్రశంసించారు. జ్ఞానం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజంలో వ్యాప్తి చేయడంలో కవుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ అభినందన సభలో జనసేన పార్టీ కువైట్ ప్రతినిధి హరి రాయల్, టీడీపీ నాయకులు రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఏం.డి.అర్షద్, రెడ్డయ్య చౌదరి, రవి, రామకృష్ణ, కరీం, బాబ్జీ, శ్యామ్, అలాగే జనసేన నాయకులు మల్లిఖార్జున, గంగా తదితరులు పాల్గొని నాజర్ ని అభినందించారు.
ఈ కార్యక్రమం కువైట్‌లోని తెలుగు ప్రవాసుల మధ్య సాంస్కృతిక, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేసిన సందర్భంగా నిలిచింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







