అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- December 25, 2025
హైదరాబాద్: భారత క్రీడా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అర్జున అవార్డుల నామినేషన్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి ఈసారి అర్జున అవార్డుల కోసం నామినేట్ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన 24 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి వీరిద్దరి పేర్లు చోటు దక్కడం విశేషంగా నిలిచింది. వినికిడి లోపం ఉన్నా డెఫ్ ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు సాధించిన ధనుష్, నిలకడగా రాణిస్తున్న గాయత్రి ప్రతిభను సెలెక్షన్ కమిటీ గుర్తించింది. ఈ జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవార్డులు ప్రదానం చేస్తారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!







