శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- December 25, 2025
అమెరికా: శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 సాయంత్రం కేలిఫోర్నియా రాష్ట్రం ప్లాసెంటియా నగరంలోని వాలెన్సియా హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన నిధుల సేకరణ లైట్ మ్యూజిక్ కచేరీ ఘన విజయాన్ని సాధించింది.
ఈ సంగీత కార్యక్రమంలో ప్రముఖ గాయనులు సుమంగళి, అంజనా సౌమ్య, పార్థు నేమాని మరియు మల్లికార్జున్ మూడు గంటలకు పైగా శ్రోతలను మంత్రముగ్ధులను చేసే మధుర గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించగా, పలువురు ప్రముఖులు హాజరై వేడుకను మరింత ఘనతపరిచారు. ప్రైమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా.ప్రేమ్ రెడ్డి ముఖ్య అతిథిగా, లాస్ ఏంజెలెస్‌లో భారత దేశ కాన్సుల్ జనరల్ డా.కె. జె. శ్రీనివాస గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
లక్షలాది మందికి చూపును తిరిగి ప్రసాదించాలనే శంకర నేత్రాలయ మహత్తర లక్ష్యం దాతలు మరియు స్పాన్సర్ల ఉదార సహకారంతోనే సాధ్యమవుతోంది.ఈ సందర్భంగా లాస్ ఏంజెలెస్‌కు చెందిన MESU స్పాన్సర్లు శరత్ కామినేని,శ్యామ్ కునాం, డా.కృష్ణ రెడ్డి,గౌతమ్ నెల్లుట్ల అలాగే దాతలు లక్ష్మీ & త్రినాథ్ గొటేటి,మల్లిక్ కేశవరాజు, డాక్టర్లు మురళి & స్వర్ణ చందూరి,శివనాథ్ పరానండి ను డా.ప్రేమ్ రెడ్డి సన్మానించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన కాన్సుల్ జనరల్ డా.కె. జె. శ్రీనివాస, భారతదేశం మరియు నివసిస్తున్న దేశం మధ్య సానుకూల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. డా. ప్రేమ్ రెడ్డి గారు శంకర నేత్రాలయ సేవలను ప్రశంసిస్తూ, మరింత మంది సమాజ సభ్యులు ఈ మహత్తర కార్యంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలు కంటి వైద్య శిబిరాల నిర్వహణను స్వయంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ అప్పల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మల్లిక్ బండ, పబ్లిసిటీ చైర్ ప్రసాద్ రాణి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి సిరిగిరి, చాప్టర్ లీడ్స్ ప్రీతి, భాస్కర్, వెంకట్ పోలూ, నాగరాజ ఎమగౌడ, సతీష్ తొట్టెంపూడి, శ్రవణ్ నయ్యాటి తో పాటు వాలంటీర్లు శ్రీని సిరిగిరి, శంకర్ చాపా, విష్ణు కల్వకూరు, చంద్ర వెంపాటి, అమర్ బుడగమంట్ల, శారద్ర వాయినేని, మహేష్ కపడమ్, మోహన్ & అనిత కత్రగడ్డ, అనిత, నవీన్ & అనిత భూమండ్ల, నరేష్ మసారం మరియు సురేష్ బొండా విశేష కృషి చేశారు.
ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షులు బాల రెడ్డి ఇందుర్తి, అలాగే మూర్తి రేకపల్లి, డా.రెడ్డి ఉరిమింది,వంశీ ఎరువరం,రత్నకుమార్ కావుటూరు,గిరి కోటగిరి,గోవర్ధన్ రావు నిడిగంటి కు చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ కార్యక్రమానికి డా.జీర్డెడ్డి ప్రసాద్, డా.వెంకు రెడ్డి, డా.నంద కుమార్ తిరువైపతి, డాక్టర్లు సావిత్రి & కమలాకర్ రాంభట్ల, డాక్టర్లు గీతా & వెంకట్, డా.రాధా శర్మ, సేరిటోస్ కమిషనర్ అశోక్ పట్నాయక్, AIG హాస్పిటల్స్‌కు చెందిన డా.రాకేష్ కలపాల వంటి ప్రముఖులు హాజరై వేడుకను మరింత విశిష్టంగా నిలిపారు. అలాగే TASC (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కేలిఫోర్నియా) అధ్యక్షులు సీతారామ్ పమ్మిరెడ్డి, అధ్యక్షుడు-ఎలెక్ట్ కొండల వాయినేని, మాజీ అధ్యక్షులు అనిల్ అర్రబెల్లి కూడా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.


తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







