ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- December 28, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో రియల్ ఎస్టేట్ ధరల సూచీ 2025 మూడవ త్రైమాసికంలో 17.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన డేటా ప్రకారం, వాణిజ్య భూముల ధరలలో 19 శాతం పెరుగుదల కారణంగా వాణిజ్య రియల్ ఎస్టేట్ ధరల సూచీ 14.6 శాతం పెరిగింది. అయితే రిటైల్ దుకాణాల ధరలు 8.5 శాతం తగ్గగా.. పారిశ్రామిక భూముల ధరలు 5.5 శాతం పెరిగాయి. ఇక రెసిడెన్సీ ఆస్తుల ధరల సూచీ 2025 మూడవ త్రైమాసికంలో 18.7 శాతంగా ఉంది. నివాస భూముల ధరలు 19.6 శాతం, నివాస అపార్ట్‌మెంట్ల ధరలు 22.4 శాతం పెరిగాయి. విల్లాల ధరలు 16.5 శాతం పెరిగగా, అయితే ఇతర ఇళ్ల ధరలు 0.5 శాతం తగ్గాయి.
ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో నివాస భూముల ధరలలో మస్కట్ గవర్నరేట్ అత్యధికంగా 48.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఆ తర్వాత ముసందమ్ గవర్నరేట్ 29.7 శాతం, అల్ దఖిలియా గవర్నరేట్ 12.3 శాతం, సౌత్ అల్ బతినా గవర్నరేట్ 8.7 శాతం, నార్త్ అల్ బతినా గవర్నరేట్ 8.1 శాతం వృద్ధిని నమోదు చేయగా, ధోఫర్ గవర్నరేట్ 4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే సమయంలో కొన్ని గవర్నరేట్లలో నివాస భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి. అల్ ధాహిరా గవర్నరేట్‌లో 25.8 శాతం, అల్ బురైమి గవర్నరేట్‌లో 24.6 శాతం, అల్ వుస్తా గవర్నరేట్‌లో 13.3 శాతం, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 4 శాతం, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో 2.2 శాతం తగ్గుదల నమోదైంది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







