సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- December 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో భద్రతా అధికారులు గత వారం రోజులలో మొత్తం 18,877 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీల సందర్భంగా ఈ అరెస్టులు జరిగాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టు అయిన వారిలో 11,991 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,808 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు మరియు 3,078 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. మొత్తం 13,241 మంది అక్రమ నివాసితులను బహిష్కరించగా, 20,378 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు పంపారు.
ఇక సరిహద్దు దాటి వచ్చేందుకు ప్రయత్నిస్తూ అరెస్టు అయిన వారి మొత్తం సంఖ్య 1,312. వీరిలో 44 శాతం మంది యెమెన్ జాతీయులు, 55 శాతం మంది ఇథియోపియన్ జాతీయులు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. అలాగే, సౌదీని విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ మొత్తం 46 మంది అరెస్టు అయ్యారు. వీరితోపాటు వీరికి సాయం చేసిన సుమారు 14 మందిని కూడా అరెస్టు చేశారు.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు, అలాగే మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు ఫోన్ చేసి, ఏవైనా ఉల్లంఘనల కేసులు ఉంటే తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







