కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- December 29, 2025
కువైట్: కువైట్ లోఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మంగళవారం నుండి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాత్రి సమయంలో కోల్డ్ వేవ్స్ వీచే అవకాశం ఉంటుందని, ఎడారి మరియు వ్యవసాయ ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజామున మంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ యాక్టింగ్ డైరెక్టర్ దరర్ అల్-అలి వెల్లడించారు.
కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో దుమ్ము తుఫానులు సంభవించవచ్చని పేర్కొన్నారు. సముద్రపు అలలు కూడా ఏడు అడుగుల కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 12 మరియు 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 మరియు 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చి వెల్లడించారు. ఒపెన్ ఎడారి మరియు వ్యవసాయ ప్రాంతాలలో ఇంకా తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







