'బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్' ను అనౌన్స్ చేసిన బండ్ల గణేష్

- December 30, 2025 , by Maagulf
\'బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్\' ను అనౌన్స్ చేసిన బండ్ల గణేష్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్, మాస్ మహారాజా రవితేజ నటించిన 'అంజనేయులు' చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతోనే ఆయన తన సొంత బ్యానర్ 'పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్'ను ప్రారంభించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలన బ్లాక్‌బస్టర్ 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఈ బ్యానర్‌కు మొదటి  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లభించింది. ఈ సినిమా బండ్ల గణేష్‌ను ఒక విజయవంతమైన నిర్మాతగా సుస్థిరం చేసింది. ఆ విజయం స్ఫూర్తితో, ఈ బ్యానర్ 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో', 'టెంపర్' వంటి అనేక ప్రతిష్టాత్మక, కమర్షియల్ గా  విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినిమాలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పుడు తన కొత్త నిర్మాణ సంస్థ 'బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్' (బీజీ బ్లాక్‌బస్టర్స్) ని అనౌన్స్ చేశారు. ఈ కొత్త అధ్యాయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే విషయం ఏమిటంటే, ఇందులో నెక్స్ట్ జనరేష్ భాగస్వామ్యం కావడం.

బీజీ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్ ద్వారా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, నిజాయితీతో కూడిన కథలు, కంటెంట్ రిచ్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో బండ్ల గణేష్ ముందుకు సాగుతున్నారు. కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, ఫ్రెష్ టాలెంట్‌కు అవకాశం ఇవ్వడమే ఈ బ్యానర్ ప్రధాన ఉద్దేశం.

బండ్ల గణేష్, అతని టీం వరుసగా ఎక్సయిటింగ్ ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రణాళికలు చేస్తున్నారు.ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ ఖరారైంది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com