ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!

- December 31, 2025 , by Maagulf
ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!

మనామా: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF) బహ్రెయిన్ అధికారికంగా ఫాబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. ఈ ప్రారంభోత్సవ వేడుక ఇండియన్ క్లబ్ ఆడిటోరియంలో జరిగింది. క్యాలెండర్‌లను ICRF చైర్మన్ అడ్వాన్స్ V.K. థామస్ మరియు జనరల్ సెక్రటరీ అనీష్ శ్రీధరన్ ఆవిష్కరించారు.

2026 క్యాలెండర్‌లలో స్పెక్ట్రమ్ ఆర్ట్ కార్నివాల్ సందర్భంగా వివిధ విభాగాలలో రాణించిన విద్యార్థుల కళాకృతులను పొందుపరిచారు.  ఈ కార్యక్రమంలో ఫాబర్-కాస్టెల్ కంట్రీ హెడ్ అబ్దుల్ షకూర్ మొహమ్మద్, మలబార్ గోల్డ్ రీజినల్ మార్కెటింగ్ హెడ్ మొహమ్మద్ హమ్దాన్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com