ఉపకులపతుల నియామకం రద్దు..
- July 27, 2016
తెలంగాణలో వీసీల నియామకం రద్దు చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోసలే, జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉప కులపతుల నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమ నిబంధనలను ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవో నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పును నాలుగు వారాలపాటు న్యాయస్థానం రిజర్వ్ చేసింది. రెండు రోజుల క్రితం 8 వర్సిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీసీలను నియమించిన విషయం తెలిసిందే.
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవులను రెండేళ్లుగా భర్తీ చేయకుండా ఆగినవారు మరో రెండు రోజులు ఆగలేకపోయారా..? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని గత సోమవారం విచారణ సందర్భంగా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఛాన్స్లర్లు, వీసీల నియామకాలకు సంబంధించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తుండగా... నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. విచారణ పూర్తయ్యే దాకా నియామకాలు జరపబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారని.. దాన్ని పక్కనబెట్టి ఎందుకు నియామకాలు చేపట్టారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికీ ఛాన్సలర్లుగా అవకాశం కల్పించేలా ప్రస్తుత జీవో ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







