పురావస్తు శాస్త్రవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి
- July 27, 2016
పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఎన్నో చరిత్రలను బయటకు తీసి వందలాది శాసనాలను ప్రకటించిన గొప్ప చరిత్రకారునిగా పరబ్రహ్మశాస్త్రి నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి చాటి చరిత్రకు మేలు చేశారని సీఎం కొనియాడారు. పరబ్రహ్మశాస్త్రి పరమపదించడం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శాత వాహనుల వంశ చరిత్రపై పరిశోధనలు చేసి తెలుగువారని రుజువు చేసిన చరిత్రకారుడు పరబ్రహ్మ శాస్త్రి అని గుర్తు చేశారు. ఆయన మృతి తెలగు భాషకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటని బాలకృష్ణ అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







