సౌదీ అరేబియా: 2025 లో 356 మందికి మరణశిక్ష
- January 02, 2026
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 356 మందికి మరణ దండన అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్‌కు సంబంధించినవే కావడం విశేషం.
ఒకవైపు పర్యాటకం, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని సౌదీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







