టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు

- January 02, 2026 , by Maagulf
టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు

న్యూ ఢిల్లీ: తపాలా శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30 వేల గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ నియామకాలు పూర్తిగా పది తరగతి మార్కుల ఆధారంగా, గ్రామ స్థాయిలో చేపట్టనున్నారు.

అభ్యర్థుల వయస్సు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగడం ఈ ఉద్యోగాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

బీపీఎం, ఏబీపీఎం పోస్టుల భర్తీకి ప్రకటన

గ్రామీణ డాక్ సేవక్ కేడర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టుకు నెలకు రూ.18,000 వరకు వేతనం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుకు నెలకు రూ.16,000 వరకు వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు ఫీజును రూ.100గా నిర్ణయించారు.

అర్హతలు, దరఖాస్తు విధానం, జిల్లాల వారీ ఖాళీల వివరాలు వంటి పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com