స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- January 02, 2026
స్విట్జర్లాండ్: అప్పటి వరకు వారంతా కొత్త సంవత్స రాన్ని ఆనందంగా ఆహ్వానించేందుకు భారీ ఎత్తున వేడుకల్ని ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఉల్లాసంగా కేరింతలు ఆడుతున్న సమయం..ఆకాశమే మా హద్దు అంటూ ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. రానున్న కొత్త ఏడాది తమ కుటుంబాలు మరింత ఆనందంతో ఉప్పొంగిపోవాలనే ఆరాటం ప్రతివారి మదిలో నిండుకుని ఉంది. అందుకే ప్రపంచాన్నే మర్చిపోయి, తమదైన ఆనందసాగరంలో మునిగిపోయారు. కానీ అనుకోని విపత్తు ఒక్కసారిగా వచ్చి, వారిలో అనేకుల మరణానికి కారణమైంది. న్యూఇయర్ వేళ స్విట్జర్లాండ్ లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవించడంతో పెను విషాదం చోటు చేసుకుంది. లగ్జరీ స్కీ రిసార్ట్ బార్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 47 మంది దుర్మరణం చెందగా.. 115మంది గాయపడ్డారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు.
నూతన సంవత్సరం వేళ క్రాన్స్ – మోంటానాలోని ఆలైన్ రిసార్ట్ బార్ లోని వందలాది మంది వినోదంలో మునిగిపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు అందరూ ఒకే దగ్గరకు చేరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని కేకలు, అరుపులతో అటుఇటు పరుగులు తీశారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించేసరికి అనేకులు మృత్యువాత పడ్డారు. దీంతో 47 మంది సజీవదహనం అయ్యారు. 115 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నస్థలంలో మండే పదార్థాలను ఆకస్మాత్తుగా మండించడం వల్లే పేలుడు సంభవించిందని..దీంతో వేగంగా మంటలు వ్యాపించాయని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.
అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా మండే వస్తువులు అన్నీ ఒకేసారి మండిపోతాయని తెలిపింది.మంటల్లో గది కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు, ఎగ్జికూటివ్ డైరెక్టర్ స్టీవ్ కెర్బర్ తెలిపారు.దుర్ఘటన పై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.తీవ్ర విషాధమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.మరణించిన వారి జ్ఞాపకార్థంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై జెండాలను సగం వరకు అవనతం చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







