కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- January 02, 2026
కువైట్: 2024–2025 మధ్య క్లీనప్ డ్రైవ్ లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది.తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్‌లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీలలో దాదాపు 35 శాతానికి సమానం. అదే విధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్స్‌లు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయని పేర్కంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్‌లను మెరుగుపరిచేందుకు, మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు, 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్‌లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000 గా ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







