నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- January 02, 2026
యూఏఈ: అబుదాబిలోని స్కూల్ బస్సుల నుండి దుబాయ్‌లో లేట్ నైట్ వర్క్ చాట్ల వరకు, స్మార్ట్ఫోన్లు భాగమయ్యాయి. అదే సమయంలో వాటి అతి వినియోగంపై డాక్టర్లు పలు హెచ్చరికలు చేశారు. 94 శాతం మంది అమెరికన్ మొబైల్ వినియోగదారులు "నోమోఫోబియా"తో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్‌లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం తెలిపింది. కాగా, అధ్యయనం అమెరికాపై దృష్టి సారించినప్పటికీ, మానసిక ఆరోగ్య నిపుణులు యూఏఈతో సహా మిడిలీస్టు అంతటా ఆయా నమూనాలు అప్లికేబుల్ అవుతాయని హెచ్చరించారు.
నోమోఫోబియా సాధారణంగా ప్రజలు స్వయంగా గుర్తించే పరిస్థితిగా కనిపించదు. ఫోన్ అందుబాటులో లేనప్పుడు నిద్రలేమి, చిరాకు, ఆందోళన మరియు దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది వంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చని అబుదాబిలోని ఖలీఫా నగరంలోని NMC రాయల్ హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ సైకియాట్రీ డాక్టర్ ఒమర్ బిన్ అబ్దులాజీజ్ వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు మరియు యువకులలో స్మార్ట్‌ఫోన్ వాడకం సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అయితే, ఎవరైనా ఫోన్‌ను ఎంత తరచుగా ఉపయోగిస్తారనే దాని కంటే, ఎంత నియంత్రణ మరియు సమతుల్యతను నిలుపుకుంటారనే దానిపైనే వారు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్య ఆధార పడి ఉంటుందని మెడ్కేర్ కమాలి క్లినిక్‌లోని క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీవిద్య శ్రీనివాస్ తెలిపారు.
అయితే, ఫోన్ ను పరిమితంగా ఉపయోగించాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా బెడ్రూమ్ల నుండి వాటిని దూరంగా ఉంచడం ద్వారా నిద్రలేమి సమస్యల నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోమోఫోబియా నుంచి క్రమంగా దూరం కావచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







