టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- January 02, 2026
న్యూ ఢిల్లీ: తపాలా శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30 వేల గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ నియామకాలు పూర్తిగా పది తరగతి మార్కుల ఆధారంగా, గ్రామ స్థాయిలో చేపట్టనున్నారు.
అభ్యర్థుల వయస్సు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగడం ఈ ఉద్యోగాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బీపీఎం, ఏబీపీఎం పోస్టుల భర్తీకి ప్రకటన
గ్రామీణ డాక్ సేవక్ కేడర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టుకు నెలకు రూ.18,000 వరకు వేతనం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుకు నెలకు రూ.16,000 వరకు వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు ఫీజును రూ.100గా నిర్ణయించారు.
అర్హతలు, దరఖాస్తు విధానం, జిల్లాల వారీ ఖాళీల వివరాలు వంటి పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







