అడ్వెంచర్ గైడ్‌, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!

- January 02, 2026 , by Maagulf
అడ్వెంచర్ గైడ్‌, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!

మస్కట్: అడ్వెంచర్ టూరిజంకు ప్రధాన గమ్యస్థానంగా ఒమన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది.  ఇందులో భాగంగా హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ అధికారిక గైడ్‌బుక్‌లు మరియు సర్టిఫైడ్ పర్వత ట్రైల్ మ్యాప్‌లను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం పర్యాటక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది ఆధ్వర్యంలో నిర్వహించారు.

కొత్తగా విడుదల చేసిన మెటీరియల్‌లు అడ్వెంచర్ టూరిజం ఆపరేటర్లు మరియు ఔత్సాహికులకు సమగ్రంగా ఉపయోగపడుతుందన్నారు. భద్రతా అవగాహనను పెంపొందించడం, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులను ప్రోత్సహించడం మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అడ్వెంచర్ కార్యకలాపాలు నిర్వహించేలా దోహదం చేస్తాయని వెల్లడించారు. 

పర్వతాల నుండి విస్తారమైన ఎడారులు, సహజమైన తీరప్రాంతాలు ఒమన్ వైవిధ్యమైన సహజ ప్రకృతి నిలయాలు.. విదేశాల నుండి పర్యాటకుల రాకను పెంచుతాయని తెలిపారు. హైకింగ్, రాక్ క్లైంబింగ్, కాన్యోనింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ వంటి కార్యకలాపాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com