మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- January 02, 2026
అమెరికా: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో సీఈవో సత్య నాదెళ్ల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అతి పెద్ద నాయకత్వ మార్పు చేపట్టారు. అలాగే కొన్ని పెద్ద నియామకాలను ప్రకటించారు. మెటా ఇంజనీరింగ్ మాజీ బాస్ జే పారిఖ్‌ను మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. కంపెనీ కమర్షియల్ హెడ్ జడ్సన్ ఆల్తోఫ్, లింక్డ్ఇన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ర్యాన్ రోస్లాన్ స్కైతో సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా నియమించింది.
మైక్రోసాఫ్ట్ లో దీర్ఘకాలంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న జడ్సన్ ఆల్తోఫ్‌ను.. కమర్షియల్ బిజినెస్ CEOగా పదోన్నతి కల్పించింది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయించడానికి పోటీ పడుతోంది. ఈ క్రమంలో టెక్నికల్ వర్క్ పై CEO నాదెళ్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి వీలు కల్పించేలా ఈ చర్య ఉంది.
ఇప్పుడు ఆల్తాఫ్ పై కీలక బాధ్యతలు ఉన్నాయి. మార్కెటింగ్, సేల్స్, సపోర్ట్, ఆపరేషన్స్ కు నాయకత్వం వహిస్తారు. ఇందులో కస్టమర్ అవసరాలకు సరిపోయేలా దాని ఇంజనీరింగ్ బృందాలకు ప్రాధాన్యతలను నిర్ణయించడం కూడా ఉంటుంది. ఆల్తాఫ్ 2013లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. తొమ్మిది సంవత్సరాలకు పైగా కంపెనీ గ్లోబల్ సేల్స్ బృందానికి నాయకత్వం వహించారు. ఈ మార్పు మైక్రోసాఫ్ట్‌లో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ముఖ్యమైన నాయకత్వ మార్పులలో ఒకటిగా పరిగణించబడుతోంది. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ టకేషి నుమోటో, అతని బృందం కూడా ఇప్పుడు నేరుగా ఆల్తాఫ్‌కు రిపోర్ట్ చేస్తారు. చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కరోలినా డైబెక్ హ్యాప్పే బృందం కూడా కొత్త సంస్థలో చేరనుంది.
ఇటీవలి మార్పుల తర్వాత సత్య నాదెళ్లకు ఇప్పుడు 16 డైరెక్ట్ రిపోర్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణ.. డేటా సెంటర్ నిర్మాణం, సిస్టమ్స్ ఆర్కిటెక్చర్, AI పరిశోధనపై మరింత దృష్టి పెట్టడానికి CEO నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ నాయకులకు వీలు కల్పిస్తుంది. దీనిపై నాదెళ్ల తన ఉద్యోగులకు మెయిల్ చేశారు. మనం టెక్టోనిక్ AI ప్లాట్‌ఫామ్ మార్పు మధ్యలో ఉన్నాము, దీనికి కొత్త సరిహద్దును నిర్మిస్తూనే, వ్యాపారాన్ని నిర్వహించడం అభివృద్ధి చేయడం అవసరం అని అందులో పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు నేరుగా నివేదించాల్సి 16 మంది అధికారులు..
బ్రాడ్ స్మిత్, వైస్ చైర్ అండ్ ప్రెసిడెంట్
కెవిన్ స్కాట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
నుమోటో, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
జడ్సన్ అల్తాఫ్, మైక్రోసాఫ్ట్ కమర్షియల్ సీఈవో
కరోలినా హప్పే, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్
అమీ హుడ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్
స్కాట్, క్లౌడ్- ఏఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
అమీ కోల్ మాన్, ఈవీపీ, చీఫ్ పీపుల్ ఆఫీసర్
క్యాథలీన్ హోగన్, ఈవీపీ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ట్రాన్సఫర్ మేషన్
రాజేశ్ ఝా, ఈవీపీ, ఎక్స్ పీరియన్స్ డివైజ్
జే పారిఖ్, కోర్ ఏఐ అండ్ ఇంజినీరింగ్ మేనేజర్
చార్లీ బెల్- ఈవీపీ, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ
ముస్తఫా సులేమాన్ – మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో
జేసన్ జండర్ – మైక్రోసాఫ్ట్ డిస్కవరీ అండ్ క్వాంటమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
ర్యాన్ రోస్లాన్ స్కై – లింక్డ్ ఇన్ సీఈవో అండ్ ఈవీపీ ఆఫ్ ఆఫీస్
ఫిల్ స్పెన్సర్ – మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈవో
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







