కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!

- January 08, 2026 , by Maagulf
కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!

కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాలలో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. వెస్ట్ ఫునైటీస్ రిజర్వాయర్ల వద్ద నీటి నెట్‌వర్క్‌పై నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో సౌత్ అబ్దుల్లా అల్-ముబారక్, జ్లీబ్ అల్-షుయూఖ్ మరియు అల్-సులైబియా ఫారాలతో సహా అనేక ప్రాంతాలలో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఏదైనా నీటి సరఫరా అంతరాయం ఏర్పడినా లేదా  విచారణల కోసం వినియోగదారులు 152 నంబర్‌లో కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com