యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!

- January 08, 2026 , by Maagulf
యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!

యూఏఈ: నెస్లే తన ఇన్ ఫాంట్ పోషకాహార ఉత్పత్తులలో కొన్ని బ్యాచ్‌లను రీకాల్ చేసింది.అయితే, పరిమిత సంఖ్యలో ఆయా ఉత్పత్తులను రీకాల్ చేసినట్లు ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EDE) ప్రకటించింది. అయితే, కిట్‌కాట్ మరియు నెస్కేఫ్ తయారీదారులతో సమన్వయంతో తీసుకున్న నిర్ణయం స్వచ్ఛందంగా మరియు ముందు జాగ్రత్త చర్యగా అని స్పష్టం చేసింది. రీకాల్ చేసిన ఉత్పత్తులలో NAN కంఫర్ట్ 1, NAN ఆప్టిప్రో 1, NAN సుప్రీం ప్రో 1, 2 మరియు 3, ఐసోమిల్ అల్టిమా 1, 2, 3, అల్ఫామినో ఉన్నాయి అని EDE ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ప్రతికూల సంఘటనలు నమోదు కాలేదని, అన్ని ఇతర నెస్లే ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది.

ఆయా ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలలో ఒకదానిలో బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.  ఇది టాక్సిన్ సెరూలైడ్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఇది  ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వార్తులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 37 దేశాలలో ఆయా ఉత్పత్తులను రికాల్ చేస్తూ ఆరోగ్య హెచ్చరికలు జారీ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com