దుబాయ్ చెస్ టోర్నీలో తెలంగాణాకి చెందిన రాహుల్ కి రజత పతకం
- July 28, 2016
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. రాహుల్ శ్రీవాస్తవ దుబాయ్ జూనియర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో మెరిశాడు. దుబాయ్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అతను రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు స్విస్ లీగ్ ఫార్మాట్లో జరిగిన ఈ ఈవెంట్లో అతను 7.5 పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు... ఒకే ఒక్క మ్యాచ్‌లో మొహమ్మద్ రహమాన్ (బంగ్లాదేశ్) చేతిలో ఓడాడు.రహమాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఏడున్నర పాయింట్లతో రాహుల్‌తో కలిసి మట్విషెన్ విక్టర్ (ఉక్రెయిన్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో రాహుల్‌కు రెండు, విక్టర్ మూడో స్థానం దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కుర్రాడికి పతకంతో పాటు రూ. లక్షా 5వేల (1600 డాలర్లు) ప్రైజ్‌మనీ లభించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







