సిరియాలో ఐసిస్ రెండు కారు బాంబులు పేల్చారు
- July 28, 2016
సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఖ్వాంష్లీలో రెండు కారు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 50మంది మృతి చెందారు. సిరియాలో కుర్దులను టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. కుర్దులు ఎక్కువగా ఉండే ఖ్వాంష్లీ పట్టణంలో కారు బాంబులతో విధ్వంసం సృష్టించారు. ఖ్వాంష్లీ మార్కెట్ ఏరియాలో మొదట ఓ కారు బాంబు పేలింది. ఈ పేలుడు జరిగిన పది నిమిషాల్లో మరో కారు బాంబు పేల్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందమందకిపైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సరిహద్దులో ఉన్న ఈ పట్టణంలో నెలరోజుల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కారుబాంబు పేల్చి 20మందిని బలిగొన్నారు. తాజాగా మరోసారి దాడి చేయడంతో సరిహద్దులను సిరియా ప్రభుత్వం మూసివేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







