బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!

- January 09, 2026 , by Maagulf
బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!

దోహా: బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలికంగా పూర్తి ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ  ప్రకటించింది. దీనివల్ల వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం జి-రింగ్ రోడ్డుకు వెళ్లే ఎగ్జిట్ వే ని ఉపయోగించే వాహనదారులు ప్రభావితమవుతారని తెలిపింది.
రోడ్డు నిర్వహణ మరియు అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా ఈ మూసివేత ఆంక్షలు జనవరి 11న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 18 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com