'బాబు బంగారం' తమిళంలో

- July 28, 2016 , by Maagulf
'బాబు బంగారం' తమిళంలో

యంగ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'బాబు బంగారం'. వెంకీ, నయన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేయడానికి చిత్రనిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు సినిమాలను తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేసే భద్రకాళి ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తమిళంలో 'సెల్వి' పేరుతో విడుదల చేస్తోంది. 'సెల్వి' అంటే తమిళంలో కుమారి అని అర్థం. నయనతారకు తమిళంలో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ వెంకీ అభిమానులతో సగటు ప్రేక్షకుడ్ని సైతం అలరించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com