ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- January 09, 2026
రియాద్: ఇటీవల ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ ప్రాంతంలో చేసిన పర్యటనను సౌదీ అరేబియా, అరబ్, ఇస్లామిక్ మరియు ఆఫ్రికన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇజ్రాయెల్ వ్యవహార శైలి సోమాలియా సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించేదిగా ఉందని అభివర్ణించారు. ఈ ప్రకటనను అల్జీరియా, బంగ్లాదేశ్, కొమొరోస్, జిబౌటి, ఈజిప్ట్, గాంబియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, కువైట్, లిబియా, మాల్దీవులు, నైజీరియా, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఖతార్, సూడాన్, తుర్కియే, యెమెన్, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా సంయుక్తంగా ఆమోదించాయి.
సోమాలిలాండ్‌ను గుర్తిస్తున్నట్లు ఇజ్రాయెల్ గుర్తించడాన్ని ఈ సందర్భంగా తిరస్కరించారు. జనవరి 6న ఇజ్రాయెల్ అధికారి ఈ ప్రాంతాన్ని సందర్శించడాన్ని ఖండించారు. సోమాలిలాండ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సోమాలియాలో అంతర్భాగమని స్పష్టం చేశారు. ఈ పర్యటన సోమాలియా సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను బలహీనపరుస్తుందని,ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







