ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- January 09, 2026
దోహా: ఖతార్ సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ రెండు ఆన్లైన్ వేలాన్ని ప్రకటించింది. ఇందులో వెహికల్స్, ప్రాపర్టీలు ఉన్నాయి. జ్యుడీషియల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ఆక్షన్స్ అడ్మినిస్ట్రేషన్ వేలం నిర్వహిస్తుందని X పోస్ట్‌లో వెల్లడించింది. కోర్ట్ మజాదత్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా వేలం పాట నిర్వహించనున్నట్లు కౌన్సిల్ తెలిపింది.
ఆన్లైన్ వాహన వేలం జనవరి 11న సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఆసక్తిగల బిడ్డర్లు కోర్ట్ మజదత్ యాప్ ద్వారా సమీక్షించి బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు ఉదయం 9:30 నుండి ఉదయం 11 గంటల వరకు వివిధ ప్రదేశాలలో ఉన్న వాణిజ్య మాల్స్, నివాస సముదాయాలు, హోటల్ భవనాలను వేలం వేయనున్నారు.
కాగా, ఆస్తి వివరణలు, బిడ్డింగ్ విధానాలు మరియు రిజిస్ట్రేషన్ సహా రెండు వేలంపాటల పూర్తి వివరాలు కోర్ట్ మజదత్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయని.. మరింత సమాచారాన్ని కౌన్సిల్ అధికారిక ఛానెల్‌ల ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







