KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- January 09, 2026
ఆంధ్రప్రదేశ్లోని KL యూనివర్సిటీలో ETV విన్ సంస్థ తమ ‘WIN.Club’ను అధికారికంగా ప్రారంభించింది. విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ డైరెక్టర్ పి.సాయి విజయ్ సహకారంతో ‘WIN.Club’ను ఏర్పాటు చేశారు.ఈ క్లబ్ ద్వారా విద్యార్థులకు సృజనాత్మక రంగాల్లో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు రంగాల్లో అనుభవం పొందే అవకాశాలు లభించనున్నాయి.
KL యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. సారధి వర్మ మరియు ప్రో-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.వీ.ఎస్. ప్రసాద్ సమక్షంలో ఈ ఎంఓయూ (MoU) ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ETV విన్ హెడ్ సాయి కృష్ణ కొయిన్ని, మార్కెటింగ్ హెడ్ యువకాంత్ బండారి, మరియు WIN.Club కోఆర్డినేటర్ వి. దివ్య దర్శిని పాల్గొన్నారు.విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారికి తగిన అవకాశాలను కల్పించడమేఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని ఈటీవీ విన్ వారు తెలిపారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







