డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!

- January 10, 2026 , by Maagulf
డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!

యూఏఈ: యూఏఈలో యువ ఎమిరాటీలు డిజిటల్ చెల్లింపులకే అధికంగా మొగ్గుచూపుతున్నారు. కాంటాక్ట్‌లెస్ చెల్లింపులే తమ తొలి ప్రాధాన్యతగా ఉంటుందని పలువురు యువ ఎమిరాటీలు వెల్లడించారు. ఫిజికల్ కార్డుల వినియోగం తక్కువగా చేస్తామని వారు చెబుతున్నారు.

వేగం, భద్రత మరియు పెరుగుతున్న మౌలిక సదుపాయాల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు తమ ప్రాథమిక చెల్లింపు పద్ధతిగా కార్డులను భర్తీ చేశాయని పలువురు యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, మొబైల్ వాలెట్ లావాదేవీలు గత సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధించాయి.   

తాను తరచూ ఆపిల్ పే ఉపయోగిస్తానని, కొన్ని నెలలుగా ఫిజికల్ కార్డును వినియోగించలేదని ఒమర్ ముస్తఫా అనే యూనివర్సిటీ స్టూడెంట్ తెలిపాడు. ఇది వేగవంతమైనది మరియు నేను వాలెట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. తన ఫోన్‌తో ప్రతిచోటా చెల్లిస్తాను..  కార్డ్ ఇంట్లోనే ఉంటుందని తెలిపాడు.  

రిటైలర్లు, కేఫ్‌లు, ప్రజా రవాణా మరియు సర్వీస్ కౌంటర్లు ఇప్పుడు దాదాపు డిఫాల్ట్‌గా ట్యాప్-టు-పేని అంగీకరిస్తున్నాయి.  పేమెంట్ కాగానే తక్షణ నోటిఫికేషన్‌లు వస్తాయని, కార్డ్ స్కిమ్మింగ్ గురించి తామ ఆందోళన చెందడం లేదని మరికొందరు ఎమిరాటీలు తెలిపారు.  

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ కాలంలో కార్డులు ఇప్పుడు చెక్కులు పాతవిగా అనిపిస్తాయని కొందరు చెప్పారు. డిజిటల్ వాలెట్ల వినియోగం పెరిగిందని ఇటీవల సెంట్రల్ బ్యాంక్ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.  ఇప్పుడు బ్యాంక్ కార్డులను టామ్ మరియు ట్రాన్సిట్ సిస్టమ్స్ వంటి ప్రభుత్వ సూపర్-యాప్‌లలో డిజిటల్‌గా డిపాజిట్ చేసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొంది. రాబోయే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాలంలో డిజిటల్ చెల్లింపులు ఆధిపత్యం చెలాయిస్తాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com