జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!
- January 10, 2026
జెడ్డా: భారీ స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు జకాత్, పన్నులు మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) తెలిపింది. జెడ్డా ఇస్లామిక్ పోర్టుకు వచ్చిన ఒక పార్సిల్ లో దాచి ఉంచిన 4,793,000 ఆంఫెటమైన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ZATCA ప్రతినిధి హమ్మూద్ అల్-హర్బీ తెలిపారు. బొగ్గు సంచుల లోపల దాచి ఉంచిన పిల్స్ ను ఆధునిక స్కానింగ్ తో గుర్తించినట్టు తెలిపారు.
అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్‌తో కలిసి కింగ్‌డమ్ లోపల వాటి రిసీవర్ ను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాల గురించి అథారిటీ హాట్‌లైన్ (1910), ఇమెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (009661910) ద్వారా నివేదించడం ద్వారా స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో సహకరించాలని అల్-హర్బీ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







