ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి అదనపు బ్యాగేజ్ పై ప్రత్యేక రాయితీలు
- January 10, 2026
భారతదేశపు తొలి అంతర్జాతీయ వాల్యూ క్యారియర్ అయిన Air India Express మిడిల్ ఈస్ట్ నుంచి భారత్‌కు ప్రయాణించే ప్రయాణికుల కోసం అదనపు బ్యాగేజ్ పై ప్రత్యేక పరిమితకాల రాయితీ ఆఫర్‌ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు ముందస్తుగా 5 కిలోలు లేదా 10 కిలోల అదనపు బ్యాగేజ్ ని ఆకర్షణీయమైన ధరలకు బుక్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ నుంచి భారత్‌కు ప్రయాణించే ప్రయాణికులకు వర్తిస్తుంది. జనవరి 31, 2026 వరకు చేసుకునే బుకింగ్స్‌కు, జనవరి 16 నుంచి మార్చి 10, 2026 మధ్య ప్రయాణాలకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అవార్డు గెలుచుకున్న వెబ్సైట్ http://www.airindiaexpress.com, మొబైల్ యాప్‌తో పాటు అన్ని ప్రధాన బుకింగ్ చానళ్ల ద్వారా ఈ బుకింగ్‌లు చేసుకోవచ్చు (లభ్యతకు లోబడి).
ఈ ఆఫర్ కింద, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్‌కు ప్రయాణించే అతిథులు 5 కిలోలు లేదా 10 కిలోల అదనపు చెక్-ఇన్ బాగేజీని బహ్రెయిన్‌లో BHD 0.2, కువైట్‌లో KWD 0.2, ఒమాన్‌లో OMR 0.2, ఖతార్‌లో QAR 2, సౌదీ అరేబియాలో SAR 2, యూఏఈలో AED 2 చొప్పున కొనుగోలు చేయవచ్చు. ఈ రాయితీ Xpress Value, Xpress Lite, Xpress Flex, Xpress Biz సహా అన్ని ఫేర్ కేటగిరీలకు వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ బుకింగ్ ప్రక్రియలోనే మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
సాధారణంగా ఈ రూట్లలో Xpress Lite ఫేర్ మినహా మిగతా అన్ని ఫేర్‌లకు కనీసం 30 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్ అలవెన్స్‌ను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అందిస్తోంది. ఇప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా అదనంగా 10 కిలోలు కొనుగోలు చేసే అవకాశంతో, ప్రయాణికులు గరిష్టంగా 40 కిలోల చెక్-ఇన్ బ్యాగేజ్ తో ప్రయాణించవచ్చు.కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకునేందుకు భారత్‌కు వెళ్లే వారికి బహుమతులు, అవసరమైన వస్తువులు తీసుకెళ్లేందుకు ఇది ఎంతో అనుకూలంగా ఉండనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







