1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- January 10, 2026
దుబాయ్: దుబాయ్ లో జరుగుతున్న 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ లో 522 మంది కంటెంట్ క్రియేటర్లు మరియు న్యూ మీడియా నిపుణులు శిక్షణ పూర్తి చేసి పట్టాలు పొందారు.ఈ కార్యక్రమానికి దుబాయ్ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.
యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం మరియు న్యూ మీడియా అకాడమీ కలిసి నిర్వహించిన 7 ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ, “భవిష్యత్ నిర్మాణానికి మానవ వనరులపై పెట్టుబడి అత్యంత కీలకం.యూఏఈ విలువలను ప్రతిబింబించేలా, బాధ్యతాయుతంగా దేశ సందేశాన్ని ప్రపంచానికి చేరవేసే కంటెంట్ క్రియేటర్లను తయారు చేయడం అవసరం”అని అన్నారు.
ఈ కార్యక్రమానికి క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ అల్ గెర్గావీ కూడా హాజరయ్యారు.
- 15 వేల మందితో భారీ సమ్మిట్
- ఈ సమ్మిట్ జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్‌లోని ఎమిరేట్స్ టవర్స్, డీఐఎఫ్సీ, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ వేదికగా జరుగుతోంది.
- ఈ కార్యక్రమానికి 15 వేల మందికి పైగా కంటెంట్ క్రియేటర్లు, 500కు పైగా వక్తలు హాజరయ్యారు. వీరి సోషల్ మీడియా అనుచరులు కలిపి 3.5 బిలియన్లకు పైగా ఉన్నారు.
- వివిధ శిక్షణా కార్యక్రమాలు
- ఈ స్నాతకోత్సవంలో భాగంగా
- ఇంపాక్ట్ మేకర్స్, స్పెషల్ కంటెంట్ క్రియేటర్లు, చారిత్రక కంటెంట్, ఫారిస్ అల్ ముహ్తవా, ప్రభుత్వ డిజిటల్ కమ్యూనికేషన్ డిప్లొమా, ఆర్థిక కంటెంట్ పయనీర్స్, సోషల్ మీడియా ప్రొఫెషనల్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
- ఈ శిక్షణ ద్వారా కంటెంట్ రైటింగ్, డిజిటల్ సాధనాల వినియోగం, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కంటెంట్ తయారీపై అవగాహన కల్పించారు.
- యూఏఈ గ్లోబల్ స్థాయిలో బలమైన సందేశం
ఈ కొత్త తరం కంటెంట్ సృష్టికర్తల ద్వారా యూఏఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రభావవంతంగా చేరుతుందని నిర్వాహకులు తెలిపారు.
--(బాజీ షేక్,యూఏఈ)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







