ఈ నెల 14న‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్
- January 10, 2026
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియర్’ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించారు. ఇప్పటికే చాలా కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ రావడంతో, విడుదలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తొలుత ఈ సినిమాను ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన చేసినా పలు కారణాలతో అది సాధ్యం కాలేదు. వాస్తవానికి ‘వా వాతియార్’ గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 12న విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే చివరి నిమిషంలో ఫైనాన్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తాయి.
నిర్మాత చెల్లించాల్సిన కొన్ని బాకీలు క్లియర్ చేయకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుంది. సంబంధిత మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సినిమా విడుదల చేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడింది.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







