'ఓ..! సుకుమారి' నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

- January 10, 2026 , by Maagulf
\'ఓ..! సుకుమారి\' నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి  విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి' చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.

ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. దామినిగా ఆమె స్పిరిటెడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రంగురంగుల హాఫ్-సారీలో, చేతుల్లో కర్రలు పట్టుకున్న గ్రామస్థుల నుంచి తప్పించుకుంటూ పరుగులు తీస్తూ, ఆమె ధైర్యం, చలాకీతనంతో పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా కనిపించింది.

ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం.కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం.తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com